4 year old raped in rajasthans dausa accused sub inspector arrested
Telecast Date: 11-11-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దౌసా జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై స్థానిక ఎస్సై దారుణానికి ఒడిగట్టాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని తన రూంకు తీసుకొచ్చి అత్యాచారం చేశాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. 

మరోవైపు, స్థానికులు ఘటనపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానిక రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి నిందితుడికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఘటనపై స్పందించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడీ లాల్ మీనా స్పందించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం చూసి పేట్రేగిపోతున్న పోలీసులు ఎన్నికల సమయంలోనూ దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading